ఎడారిలో సెలయేర్లు - అక్టోబర్ 10

నీవు వ్యసనపడకుము_ (కీర్తనలు 37:1).

ఇది నాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ‘దొంగిలించకూడదు’ అనేది ఎలాంటిదో ఇదీ అలాంటిదే.

👉 ‘వ్యసనపడడం’ అంటే ఏమిటో చూద్దాం. ‘గరుకైన ఉపరితలం కలిగి ఉండడం’ లేక ‘రాపిడికి లోనై అరిగిపోవడం’ అనే అర్థాలు దానికున్నాయి.

👉 ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఇతరులలో తప్పులు వెదికే వ్యక్తిని తీసుకోండి. అతడు తనకై తాను అరిగిపోవడమే కాక ఇతరులను అరగదీస్తున్నాడు.

👉 వ్యసనపడడం అంటే చిరాకు, విసుగుదల వ్యక్తం చేయడం.

👉 ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి మాత్రమే కాదు, దేవుని విషయం వ్యసనపడవద్దు అని ఉంది. ఇది మనకే హానికరమైనది. ఇది దేవునికి ఇష్టం లేదు.

మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవడం మన శరీరానికి ఎక్కువ హానికరం అని డాక్టర్లు చెబుతుంటారు.

👉 చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యసనపడడానికి తరువాత మెట్టు కోపపడడమే. ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ ఆజ్ఞను పాటిద్దాం “వ్యసనపడకుడి.”

*పాలపిట్ట పిచ్చుకతో అంది “ఈ మనుష్యులెప్పుడూ కంగారుగా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ చిరాకుగా కుంగిపోతారెందుకని?”

📖పిచ్చుక పాలపిట్టతో అంది కదా “మనకు ఉన్నట్టు పరలోకపు తండ్రి ఈ మనుషులకి లేడేమో!”

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్