ఎడారిలో సెలయేర్లు - నవంబర్ 22

నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?_ (మత్తయి 9:28).

📖అసాధ్యాలను సాధ్యం చెయ్యడం దేవునికి అలవాటు.

👉 ఎవరి జీవితాల్లోనయితే అసాధ్యం అనుకున్నవి, దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావాల్సి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ పనీ ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పనికాదు.

మన జీవితాల్లో తిరుగుబాటు, అపనమ్మకం, పాపం, ఆపద, ఇవన్నీ పొంచి ఉంటాయి. ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ‘ఇది చెయ్యి దాటి పోయిందని’ ఆయనెప్పుడూ అనడు.

క్రీస్తు మార్గం గురించి ఒక మాట ఉంది. ఇది నిజం కూడా. “క్రైస్తవ మార్గం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మార్గం.”

దేవుడు “చీడ పురుగులు.. తినివేసిన సంవత్సరముల పంటను” మనకి మరల ఇవ్వగలడు.

మనం మన పరిస్థితినంతటినీ, మనలనూ ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం.

ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదుగాని తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది.

దేవుడు క్షమిస్తాడు, బాగుచేస్తాడు. తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు. ఆయన కృపకు మూలమైన దేవుడు. ఆయన మీద నమ్మకముంచి స్తుతించుదాము.

కాదేదీ అసాధ్యం క్రీస్తుకి లేరెవరూ ఆయనతో సాటి

అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు. నాకేదీ అసాధ్యం కాదు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్