ఎడారిలో సెలయేర్లు - మార్చి 26

ఎస్. ఎ. కీన్ అనే భక్తుడు ఇలా అన్నాడు. 📖నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్నీ పరిశుద్దాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి కెగిరి నీ కంటికి ఆనినంత మేరా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి.

👉 విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతీ దీవెనా నీ స్వంతం అయినట్టే భావించు. ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు. అదంతా నీదే.

క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో, క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే.

👉 ఆ తరువాత ఇంకా దగ్గరికి రా, నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడివై, దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకమూ బాప్తిస్మం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరిచినప్పుడు, నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉండు.

👉 తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలూ, ఆయన ప్రేరేపణవల్ల నీలో నిదురలేచే ఆకాంక్షలూ, యేసుని వెంబడించే వారికి దొరికే అవకాశాలూ అన్నీ నీ స్వంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది.

మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది.

🔺 ఉదాహరణకి చూడండి.

👉చలికాలం ముంచుకు వచ్చినపుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం, సూర్యరశ్మి కోసం ఖండాలు, సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు.

అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు. వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి, ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు. క్రేన్స్ అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు, చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్ పూర్ అనే చోటికి వలస వచ్చాయి. ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు. అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు.

👉 పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు, ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. వాటిని అనుగ్రహించ లేకుండా ఆయన చెయ్యి కురుచ కాలేదు.

“వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొనిరి” (లూకా 22:13).

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్