ఎడారిలో సెలయేర్లు - మార్చి 21

📖మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక (మత్తయి 9:29)

👉 ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే.

👉 ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి.

👉 మనం ప్రార్ధిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యుల మైనట్టు భావన కలగాలి.

👉 అడిగినదానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి.

ఈ ప్రపంచం అనిశ్చితమూ చంచలమూ అయినది. దైవ వాక్కుకి అయితే మార్పు లేదు. నిలకడగా ఆయన మాటల మీద మనము దృష్టి నిలిపితే అని మనపట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం.

ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకు ఇస్తాడు.

ఈ వరం ఇచ్చానంటూ వచ్చిందాయన అమోఘ వాక్కు(హెబ్రీ 13:5)మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు (2 కొరింథీ 1:20)

ప్రార్థన- బ్యాంకు చెక్కు లాంటిది. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు.

“దేవుడు …… పలుకగా ఆ ప్రకారమాయెను” (ఆది 1:9).

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్