ఎడారిలో సెలయేర్లు - జూలై 1
ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును (లూకా 1:45).
నా మాటలు వాటికాలమందు నెరవేరును_ (లూకా 1:20).
ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి. ఎదురుచూసిన మనసా, నువ్వు కోరుకున్నవి ఆశతో అంటి పెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడే మాట ఇచ్చినవి మనసుకి తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి.
ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి అలసిన మనసా, విశ్రమించు దేవుని ఒడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు ఎదురుచూసే కళ్ళు దేవుణ్ణి చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి.
ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి వేసారిన మనసా, ప్రార్థించు, సంతోషించు రోజంతా మబ్బుకమ్మి వాన కురిసి వేధించినా సందెపొద్దు వాలేసరికి గుడిగంటలు మోగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం.
ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు నీకు విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవి వైపు రివ్వున ఎగిరిపోనీ గులాబి ఉదయపు ద్వారాలు పిలిచాయి రాత్రిలో కనబడని సంతోషాలు కనబడ్డాయి.
👉 దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి” (2 కొరింథీ 1:20).