ఎడారిలో సెలయేర్లు - ఫిబ్రవరి 21

📖యెహోవా యెదుట మౌనముగానుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము (కీర్తన 37:7).

నువ్వు ప్రార్థించి, ప్రార్థించి, కనిపెట్టి చూసినా ఫలితమేమి లేదా?

ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్నచోటే ఉండిపోవడాన్ని చూసి విసుగెత్తిందా?

అన్నిటినీ విసిరికొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా?

👉 ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో. అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు.

“ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము” (రోమా 8:25).

👉 ఓపిక ఆందోళనను తొలగిస్తుంది. ఆయన వస్తానన్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే.

ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది.

👉 ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు?

నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కాని ఇప్పుడే దాన్ని నీకనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశమేమంటే ఆ పరిస్థితిలోనుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని.స్వంతగా పనిచెయ్యడాన్ని సహనం దూరం చేస్తుంది.

👉 నువ్వు చెయ్యవలసిన పని ఒక్కటే - నమ్ము (యోహాను 8:20).

నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాషకంటే గొప్పదేమో.

👉 ఓపిక బలహీనతను తీసివేస్తుంది. ఆలస్యమవుతున్నకొద్దీ నిరాశ పెంచుకుని అడిగినదాన్ని వదిలెయ్యవద్దు.

దేవుడు నువ్వడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది.

“నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను” (దానియేలు 8:18).

👉 ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచియున్న సమయమంతా స్థిరంగా ఉంటాము. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తుతులతో కూడిన ఓపిక, “ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును” (కొలస్సీ 1:11) అతి శ్రేష్టమైనవి.

“ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి” (యాకోబు 1:4).

నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మసమృద్ధి పొందుతావు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్