ఎడారిలో సెలయేర్లు - ఆగస్టు 9
నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు_ (కీర్తనలు 84:5,6).
తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్నవాళ్ళకు ఓదార్పు కలగదు. మనం అట్టడుగుకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం, ఓదార్పును మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం.
📖మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకల్లో సూర్యకాంతి తళతళలేమీ లేనప్పుడు, లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి.
శోకపు లోయలో బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్నెత్తి పట్టింది
భూమికి కావాలి సూర్యకాంతి, మేఘాల జాడలు మనకీ కావాలి వెలుగునీడలు అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి
కష్టాలగుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ ఆయన పంపే శోకాలు వేదనలు కృపలో ఆయన నేర్పే పాఠాలు
ఈ కలుపు తీతకి బెదరిపోకు ఇది మన మేలుకేనని రైతుకి తెలుసని మరచిపోకు నీ ఫలితమప్పుడు నూరంతలు
శ్రమలవసరం వాటికో ప్రయోజనం ఉంది చీకటిలో శబ్దం విను ముందు ముందు నీకంతా అర్థమౌతుంది
చీకటి లోయలో వెలుగు నీడలో దేవుడే తోడు రాత్రిళ్ళు పాటలు పాడు.