ఎడారిలో సెలయేర్లు - ఏప్రిల్ 13

అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. (యెహెజ్కేలు 3:22)

📖ప్రత్యేకంగా కొంత కాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్లు మనం చూడం.

👉 మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి. పౌలు తాను మారుమనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావడం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది.

నా విషయంలో ఇలానే జరిగింది. సాహిత్యం ద్వారా దైవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలుపెట్టేద్దామనుకున్నాను కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు. “లాభం లేదు, ఆవిడకి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి” అన్నాడు. రెండూ చేయాలంటే కుదరదు.

ఇది 1860వ సంవత్సరంలో జరిగింది. ఆ గూట్లో నుండి నేను 1869 లో బయటకు వచ్చాను. నీడలో తొమ్మిదేళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది.

దేవుని ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అందువల్ల మనకి ఇష్టంగానూ అభివృద్ధికరంగానూ కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు. ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చెయ్యగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు.

నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను ”విశ్రాంతి తీసుకో” అంటూ యజమాని పిలిచాడు “క్రీస్తుతోనే నా విశ్రాంతి” నా మనసు పలికింది

తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు ఇప్పుడున్న అనారోగ్యం ఆయన నిర్ణయమే విశ్రాంతి తీసుకోమంటే కష్టపడి పోతాం మనం ఆయన దారి మంచిది, అంధులం మనం

ఆయన ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవవలసిన దారులున్నాయి అలసిన చేతులు చెయ్యవలసిన పనులు ఉన్నాయి ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది

కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది తన ఇష్టప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి మర్చిపోవద్దు, ఆయనకున్న నేర్పు మరెవ్వరికీ లేదు

పని చెయ్యడమే కాదు, శిక్షణ పొందాలి శిక్షలో యేసు శిరస్సు వంచడం నేర్చుకున్నాడుఆయన భారం తేలిక, ఆయన కాడి సులువు నీతి ఉంది ఆయన క్రమశిక్షణలో

ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం మన పని కాదు, మనం సేవకులమే పనిలోనూ, ఎదురు చూడడం లోను మన చిత్తం కాదు, దేవుని చిత్తమే నెరవేరాలి

దేవుడు మనకు పనులు పురమాయించి నట్లుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు. విశ్రాంతి తీసుకోండి. అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరకు తీసుకు వచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్